16 August, 2026 | 7:45 PM

Districts - Jayashankar Bhupalapally

article_61619222.webp
కోటగుళ్ళ లో నందీశ్వరుని 3వ వార్షికోత్సవం

గణపురం, ఆగస్టు16 (విజయ క్రాంతి): శ్రావణమాస ఉత్సవాలలో భాగంగా కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో నేడు సోమవారం నందీశ్వరుని 3వ వార్షికోత్సవాన్ని కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా నందీశ్వరునికి రుద్రాభిషేకం పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోటగుళ్లు పరిరక్షణ కమిటి విజ్ఞప్తి చేసింది.

16-08-2026

article_27891380.webp
గణపురంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

గణపురం, ఆగస్టు15 (విజయ క్రాంతి): మండల కేంద్రంలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాధిక మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు విద్యతో పాటు దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలు అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

15-08-2026